హైదరాబాద్,జూన్ 5(జనం సాక్షి ): పిసిసి చీఫ్‌గా ఉత్తమ్ ఉంటారో లేదో డౌటేనని తెలంగాణ కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ మండిపడ్డారు. రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటే.. కాంగ్రెస్ నేతల కళ్లల్లో మాత్రం చీకటి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. రైతు బీమా పథకం తెలంగాణ రైతుల పాలిట స్వర్ణయుగం కాబోతోందన్నారు. బీమా పథకంపై ఎల్‌ఐసీ ఛైర్మన్ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారని చెప్పుకొచ్చారు. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత కోమటిరెడ్డే డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. కానీ రాజీనామాలపై కాంగ్రెస్‌లోనే సఖ్యత లేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తమ బలమెంతో తెలుసుకోవాలని కోరారు. అంతేకానీ గాంధీభవన్‌లో కూర్చుని పగటి కలలు కనడం మానితే మంచిదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉంటారో లేదో డౌటేనని రాములు నాయక్ సందేహం వ్యక్తం చేశారు.




