పి. వై. యల్ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

నోముల భానుచందర్
టేకులపల్లి, సెప్టెంబర్ 9( జనం సాక్షి): ప్రగతిశీల యువజన సంఘం (PYL )రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు ఈ నెల 12,13 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో జరగనున్నందున ఈ తరగతులకు యువకులు పాల్గొని విజయవంతం చేయాలని పి. వై. యల్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి నోముల భానుచందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం టేకులపల్లి మండల సమావేశం భూక్య లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో, రాష్ట్రం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల యువత అవగాహన కొరకు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులలో నాలుగు అంశాలను బోధించడం జరుగుతుందన్నారు. 1.జాతీయోద్యమంలో యువత పాత్ర ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. శ్రీనివాస్, 2.గతిత్తరిక భౌతిక వాదం న్యూడెమెాక్రసి రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు 3. పి వై ఎల్ నిర్మాణం ,పని విధానం ,కర్తవ్యం న్యూడెమెాక్రసి రాష్ట్ర నాయకులు గొవర్దన్ 4.సెప్టెంబర్ 17 విద్రోహ, విమోచన అనే అంశం ను ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి నరసింహారెడ్డి బోధిస్తారని, కనుక యువకులు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష ,కార్యదర్శులు భూక్య లక్ష్మణ్, తొటకూరి సతీష్, సహాయ కార్యదర్శి బాణొతు క్రాంతి, జార్జి, గవాస్కర్, రామ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.