*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు (29):* మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అసంక్రమిక వ్యాధుల (N C D ) (నాన్ కమ్యూనికేబుల్ డిసీసెస్ ) జిల్లా అధికారి డాక్టర్ సౌభాగ్య లక్ష్మి సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 సంవత్సరాల పైన ఉన్న ప్రజలు తప్పకుండా బీపీ షుగర్ పరీక్షలుచేయించుకోవాలన్నారు బిపి షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఉచితంగా మందులు ఇస్తారని మనం తినే ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, గింజ ధాన్యాల, ఎక్కువగా తీసుకోవాలని జంక్ ఫుడ్స్ వాడొద్దని ప్రజలకు సూచించారు ప్రతిరోజు 30 నిమిషాల పాటు మెడిటేషన్, యోగాసనాలు, మొదలైన శారీరక వ్యాయామం చేయాలని అన్నారు అదేవిధంగా ఎవరైనా బీపీ షుగర్ ఉన్న వారిని గుర్తించి వారి వివరాలు కంప్యూటర్లో ఆన్లైన్లో నమోదు చేయాలని డాక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మంజుల, హర్షిత,ఎన్ సి డి జిల్లా కోఆర్డినేటర్ సాయి రెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి సురేష్ కుమార్, ఏఎన్ఎంలు వెంకటమ్మ బాలకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు
*పీ హెచ్ సి రికార్డులను పరిశీలించిన ఎన్ సి డి జిల్లా అధికారి*




