Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారప్రతినిధి గా దాసరి ప్రవీణ్ కుమార్ నేత నియామకం

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 29:
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధిగా చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన దాసరి ప్రవీణ్ కుమార్ నేతను నియమించినట్లు డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాసరి ప్రవీణ్ కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ ధన్యవాదాలు తెలిపారు.