హైదరాబాద్,మే5(జనం సాక్షి): వర్షాకాలంలో దెబ్బతినే రహదారులు, నాలాలు, కాల్వల మరమ్మతు పనులు చేపట్టే అధికారం పురపాలక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల సౌకర్యార్థం తక్షణమే పనులు చేపట్టి పూర్తి చేసే ధ్యేయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. రూ. 25 లక్షల మేర అత్యవసర పనులను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మరమ్మతు పనులన్నీ సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రారంభించాలని ఆదేశించింది. సెప్టెంబర్ వరకు అత్యవసర పనులు తప్ప.. సాధారణ పనులు చేపట్టొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.




