పురపాలక సంఘ కార్యాలయం లో అత్యవసర సమావేశం
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) పురపాలక సంఘ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనైనది.సమావేశంలో సద్దుల బతుకమ్మ సంబరాలు,బతుకమ్మ నిమజ్జనం మరియు దసరా పండుగలకు లక్ష్మీ నరసింహ కాలనీ మరియు తమలకుంట స్కూల్ వద్ద లైటింగ్ ఏర్పాటు,75వ తెలంగాణ జాతీయ సమాఖ్యతా దినోత్సవం సందర్భంగా ర్యాలిలో జెండాలకు పైపులు,కంక బొంగులు, ఫ్లెక్సిలు ఏర్పాటు బోర్ వెల్ సామగ్రీ, మంచి నీటి పైపు లైన్ లికేజ్ సామగ్రీ, మాస్టర్ ప్లన్, బస్తి దవకనాలు మరియు ఇతర బిల్లులు చెల్లింపు చేయుటకు మొత్తం 16 అంశాల గాను 16 అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆమోదించడం జరిగింది.
ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ రామన్న, కౌన్సిల్ సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రమేష్,మేనేజర్,సానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.