పురుగుల మందు సేవించి వృద్ధుడు ఆత్మహత్య

వేమనపల్లి,అక్టోబరు 13 (జనంసాక్షి)

వేమనపల్లి మండలం ముల్కల పేట గ్రామానికి చెందిన మునిగంటి వెంకటస్వామి(70) అనే వృద్ధుడు పురుగుల మందు సేవించి ఆతహత్య చేసుకున్నాడని ఎస్ హెచ్ ఓ ఆనంద్ పాల్ తెలిపారు.ఇటీవల మృతుడి భార్య రాజక్క చనిపోయిన కారణంగా బాధపడుతున్నాడని జీవితంపై విరక్తిచెంది ఇంట్లో కూతురు మహేశ్వరి నిద్రించే సమయంలో పురుగుల మందు సేవించిన వృద్ధుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండ్డడంతో హుటాహుటిన చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు.మృతుడికి ఇద్దరు కుమారులు పూర్ణ చారి,రవిచారి,కూతురు మహేశ్వరి ఉన్నారు. మృతుని కూతురు మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ హెచ్ ఓ ఆనంద్ పాల్ తెలిపారు.