విధుల్లోకి చేరిన వీఆర్ఏలు.
పినపాక, అక్టోబర్13(జనంసాక్షి):-
వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 80 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు దీక్షను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పినపాక మండల వీఆర్ఏలు కూడా తమ విధులకు హాజరవుతున్నామని, సమ్మె విరమణ పత్రాన్ని సమర్పించారు. నేటి నుండి విధులకు హాజరవుతున్నట్లుగా డిప్యూటీ తాసిల్దార్ రాజారామ్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెనుపాక మండల వీఆర్ఏలు కొండయ్య, నరసింహారావు, రోశయ్య, రమేష్,
తదితరులు పాల్గొన్నారు