పురుగు మందు సేవించి యువకుడు మృతి

 

 

 

 

 

 

 

 

టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఓ యువకుడు పురుగుమందు సేవించి వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన సంఘటన మండలంలోని గంగారం గ్రామంలోజరిగింది. గ్రామస్తులు కథనం ప్రకారం గంగారం గ్రామానికి చెందిన మల్కం కిరణ్ (21) అమ్మమ్మ దగ్గర జీవనం సాగిస్తూ కూలి పనులకు వెళ్తూ ఉండేవాడు. చిన్న వయసులోనే తండ్రి మృతి చెందడంతో తల్లి వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ ఉండేవాడు. మద్యానికి బానిసగా మారిన కిరణ్ శనివారం పురుగుమందు సేవించి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండడానికి గమనించి వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. బోడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.