ఖైరతాబాద్ : జూలై 19 (జనం సాక్షి) తల్లిదండ్రులు కావాలని 2015 నుంచి కోరుకుంటూ ఆకల ఫలించక ఇబ్బందిపడుతున్న ఓ జంటకు నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వైద్య నిపుణులు సంక్లిష్టమైన చికిత్స చేసి వారి కల నెరవేర్చారు. ఆ విషయాన్ని ఇక్కడ మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లోని ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల, ఆమె బృందంలోని యాలజిస్టులు కలిసి ఈ విజయం సాధించారు. దాంతో పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న పలు జంటలకు ఒక కొత్త ఆశ కలిగినట్లయింది. ఈ జంటలోని పురుషుడికి ఉన్న సంక్లిష్టమైన సమస్యను ఒలిగోస్థెనో టెరటోజూస్పెర్మియా(పురుషుడు తక్కువ స్పెర్మ్ కౌంట్, తక్కువ స్పెర్మ్ చలనశీలతను కలిగి ఉన్న పరిస్థితి) అంటారు. నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ వైద్యుల బృందం ఈ జంటలోని మహిళ గర్భవతి కావడానికి, ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడానికి సహాయపడింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల ఈ చికిత్స చేశారు.
Attachments area




