పెదప్రజల ఆశాజ్యోతి దివంగత మాజీ మంత్రి మాణిక్.
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్.
తాండూరు సెప్టెంబర్ 8(జనంసాక్షి)
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మాజీ మంత్రి మాణిక్ రావు అని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం రమేష్ మహారాజ్ అన్నారు. మాజీ మంత్రి మానేయకరావు ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి మాణిక్ రావు సేవలు ఎనలేనివని ముందు చూపుతో తాండూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాజెక్టులను కట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడే పోరాటం చేసి జైలుకు సైతం వెళ్లారని గుర్తు చేశారు. ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాకేష్ మహారాజ్, జడ్పిటిసి ధారాసింగ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, పి బసవరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,మాణిక్ రావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.