పెద్దంపల్లి లో క్లోరినేషన్ చేయించిన సర్పంచ్

రేగొండ (జనం సాక్షి) : మండలంలోని పెద్దంపల్లి  గ్రామంలో గ్రామ సర్పంచ్ పసుల ప్రియాంక రత్నాకర్ లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆదేశాల మేరకు క్లోరినేషన్, పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ని మంచినీటి బావిలో చేపించినట్లు తెలిపారు. ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి వద్ద క్లోరినేషన్ చేయించి బ్లీచింగ్ చల్లించారు. గ్రామంలో ప్రజలంతా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుమార స్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.