పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన పోతరవేని క్రాంతికి సన్మానం

జనంసాక్షి, మంథని : భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైనటువంటి పోతరవేన క్రాంతి కి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంగళవారం శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో నిబద్దతతో పనిచేస్తే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించబడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు పెద్దపెల్లి జిల్లా, మంథని నియోజకవర్గమ్ లో కాషాయం జెండా ఎగరవేయడంలో క్రాంతి గారి సేవలు తప్పకుండా ఉపయోగపడతాయని దృఢ విశ్వాసంతో ఉన్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి కో – కన్వీనర్ నాంపల్లి రమేష్, బిఎస్ఏ నియోజకవర్గ ఇంచార్జి చిలువేరి సతీష్,మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్,పట్టణ అధ్యక్షులు బుడిధ తిరుపతి, సీనీయర్ నాయకులు కొండపక సత్యప్రకాష్,ఎడ్ల సదాశివ్, రేపాక శంకర్,కొట్టే సాంబయ్య, సబ్బాని సంతోష్,బూడిద రాజు, చిట్టవేని హరీష్,జనగామ సంతోష్, సదానందం,నవీన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు