మంత్రి జగదీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఉద్యోగులు
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని సూర్యాపేట ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ హైదరాబాద్ జోన్ జాయింట్ సెక్రటరీ సుంకరి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు యావత్ ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉంటారని అన్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు అన్నివేళలా అండగా నిలుస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో టీఎంయూ సీనియర్ నాయకులు బెజవాడ సీతారాములు, బెల్లి నరసయ్య, ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి ఎన్సీ సైదులు, నాయకులు చెరుకు వెంకటయ్య, యూసఫ్, ఎండి జానీ, టి.వీరయ్య , కె.శ్రీధర్, టిబి రావు, రేణుక, సిబ్బంది జక్కలి సైదులు, జానయ్య, శ్రీనివాస్ రెడ్డి, అంజి , నాగరాజు, ఉపేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.