హైదరాబాద్, జూన్18(జనం సాక్షి) : పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా ట్రస్ట్ ఎలా ఏర్పాటు చేస్తారని పిటీషన్‌లో ఆయన పేర్కొన్నారు. విష్ణు పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై విధించిన స్టే విధించింది. దివంగత కాంగ్రెస్ నేత జనార్దన్‌రెడ్డి 1993లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని ప్రతిష్టించారు. పీజేఆర్ కుటుంబం తమ ఇలవేల్పుగా పెద్దమ్మ దేవతను భావిస్తారు. వీరి కుటుంబంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా మొదటగా పెద్దమ్మ తల్లి ఆశ్వీర్వాదాలు తీసుకుని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పీజేఆర్ మరణానంతరం పెద్దమ్మ ఆలయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు విష్ణువర్దన్‌రెడ్డి దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. పీజేఆర్ హయాం నుంచి విష్ణువర్దన్‌రెడ్డి వరకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ భక్తుల మన్ననలు అందుకుంటున్నారు. అయితే పీజేఆర్ స్థాపించిన ఈ ఆలయానికి దేవాదాయ శాఖ ధర్మకర్త మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేయడం చర్చనీయాంశమైంది.
నినినినినినినినినినినినీ




