Tuesday, 3 November 2026

పెన్ పహడ్.మండలం

“పోస్టల్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి:పోస్టల్ సూపరింటెండెంట్  యలమందయ్య”ఫోటోరైటఫ్:లింగాల పోస్టాపీస్ లో నూతన ఖాతాను ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్ పెన్ పహాడ్ జూలై 27 (జనం సాక్షి) : గ్రామాల్లో  ప్రజలకు పోస్టల్ పథకాలపై అవగహన కల్పించాలని సూర్యాపేట పోస్టల్ సూపరింటెండెంట్ యూ.యలమందయ్య అన్నారు బుధవారం మండల పరిధిలోని లింగాల బ్రాంచ్ తపాలా కార్యాలయానికి ఆకాశ్మీకంగా విచ్చేసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్న ఎస్బి,ఆర్డీ,ఎస్ఎస్ఏ,పిఎల్ఐ, ఆర్పీఎల్ఐ,టిడి,ఏంఐఎస్,నేషనల్ సేవింగ్స్,సీనియర్ సిటీజేన్, పిఎంజేజేబీవై, పీఎంఆర్జెవై లాంటి పథకాలు అందుబాటులో ఉన్నాయని వీటిని ప్రారంభించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు గ్రామీణ తపాలా ఉద్యోగులు వాటిపై ఉన్న లాభాలను వివరించాలని సూచించారు  దీనితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా నూతన ఖాతాలు ప్రారంభించాలని, ఆధార్ కార్డు అనుసంధానం కలిగిన ప్రతి బ్యాంక్ ఖాతాదారుడు బ్యాంక్ ఖాతానుండి ఏఈపీఎస్ ద్వారా రోజుకు రూ.10వేల చొప్పున నగదును స్థానిక పొస్థాపిస్ బీపీఎం,ఏబీపీఎం వద్ద ఉన్న ఐపీపీబీ మొబైల్ ద్వారా తీసుకోవచ్చని తెలిపారు పోస్టల్ డిపార్ట్మెంట్ లోని పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈకార్యక్రమంలో మెయిల్ వర్షల్ గొల్లపల్లి కోటయ్య,బీపీఎం పెండెం తిరుపతయ్య, ఏబీపీఎం చలిగంటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు…
Attachments area