*రైతు బీమా కొరకై దరఖాస్తు*

శ్రీరంగాపురం:జులై 27(జనంసాక్షి):

శ్రీరంగపురం మండలంలో ఈరోజు శ్రీరంగాపురం, నాగరాల,శేరిపల్లి గ్రామపంచాయతీలలో రైతు బీమా చేసుకోనటువంటి రైతుల వివరాల జాబితాను గ్రామపంచాయతీ దగ్గర అతికించడం జరిగింది. కావున అర్హత ఉండి రైతు బీమా చేసుకొన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 22/06/2022 వరకు రిజిస్ట్రేషన్ అయి ఉండి 18 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్నవారు అనగా 14/08/1963 నుండి 14/08/2004 సంవత్సరాల మధ్యలో పుట్టిన రైతులు రైతు బీమా కొరకు ఈ సంవత్సరానికి అర్హులు కాబట్టి,జాబితాలో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా రైతు బీమా చేసుకోగలరని వ్యవసాయ విస్తరణ అధికారి జి శ్రీనివాస్ రైతులకు తెలిపారు.

Attachments area