Monday, 2 November 2026

పెరిగిన హెల్మెట్‌ వాడకాలు

రవాణాశాఖ నిబంధనలతో ప్రజల్లో చైతన్యం

హైదరాబాద్‌,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్‌ల వాడకంపై అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని హైదరాబాద్‌ రవాణాశాఖ అధికారులు తెలిపారు. రిజిస్టేష్రన్ల సమయంలో ఇది తప్పనిసరి చేశారు. ప్రతి టూ వీలర్‌ ఓనర్‌ హెల్మెట్‌ ఉండేలా చూస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో అమలు చేస్తున్న పాయింట్ల విధానం వాహనదారులకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు. ఇప్పటివరకూ చలాన్లు రాసి జరిమానాలు వసూలు చేసిన ట్రాఫిక్‌ పోలీసులు ఇకపై అదనంగా ఆయా వాహనదారులకు పాయింట్లను నమోదు చేస్తారని జేటీసీ తెలిపారు. పాయింట్ల నమోదు వివరాలు ఎప్పటికప్పుడు ఆర్టీఏ రూపొందించిన ఎం-వ్యాలెట్‌ మొబైల్‌ యాప్‌లో అప్‌డేట్‌ అవుతూ ఉంటుందని, దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇదిలావుంటే సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. ఎంవీ యాక్టులో నియమాలను అమలు పరిచే దిశగా ట్రాఫిక్‌ విభాగం అడుగులు

వేస్తుందన్నారు. ట్రాఫిక్‌ అధికారుల ట్యాబ్‌లో సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌ చేశారన్నారు. ప్రజలకు ప్రధానంగా వాహనాదారులకు ఈ పాయింట్లపై అవగాహన కల్పించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. వాహనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ జీరో పాయింట్లతో హీరోగా ఉండాలని పౌరులకు సూచించారు. జీరో పాయింట్లు కొనసాగిస్తూ హీరోలుగా ఉండండని పేర్కొన్నారు.