Thursday, 5 November 2026

పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం

షీ టీమ్‌కు ఫిర్యాదు చేసిన మహిళ

హైదరాబాద్‌,జూన్‌ 21(జ‌నం సాక్షి): శంషాబాద్‌లోని సిద్దాంతి బస్తీకి చెందిన ఓ మహిళను అదే బస్తీలో నివాసముండే ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడని ఆ మహిళ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో షీ టీం సిబ్బది అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. షీ టీం పోలీసుల కథనం ప్రకారం.. సిద్దాంతి బస్తీకి చెందిన ఓ మహిళను అదే బస్తీలో నివాసముండే విజయ్‌ అనే వ్యక్తి గత రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, అనంతరం బెదిరించి అబార్షన్‌ కూడా చేయించాడని ఆ మహిళ షీ టీం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కాగా.. పెళ్లి చేసుకోవాలని కోరితే చేసుకోనంటూ పేర్కొంటున్నాడని, ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆమె షీ టీం పోలీసులను కోరింది.