పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం
జనంసాక్షి , కమాన్ పూర్ : పేద వర్గాలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తుందని కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రాచకొండ సరోజ, దండే కనుకయ్య లు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహయ నిధికి సిఫార్సు చేసుకోగా, ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రాచకొండ సరోజ కు 36.000 /- రూ, దండే కనుకయ్య కు 18.000/- రూ మంజూరు కాగా ఇట్టి సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు శనివారం గుండారం లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, కమాన్ పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, గుండారం ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, గాదె సది, ఆకుల గట్టయ్య, దామెర సంపత్, బోయిని బాలకృష్ణ, బొంతల ఓదెలు, బొల్లపల్లి శంకర్ గౌడ్, మోతె రాజయ్య, ఆకుల నారాయణ, కీర్తి శ్రీనివాస్, భూంపెల్లి కుమార్, మల్యాల భాస్కర్, నంది రమేష్, అవునూరి రాజయ్య, భూంపెల్లి నర్సయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.