పేదల అభ్యున్నతికి పాటుపడిన ములాయంసింగ్ యాదవ్:-
మిర్యాలగూడ, జనం సాక్షి
పేద ప్రజలు అనగారిన వర్గాల అభ్యున్నతికోసం విశేషంగా కృషి చేసిన నాయకుడు ములాయం సింగ్ యాదవ్ అని తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నాల అంజి యాదవ్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళి యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా విశేష సేవలు అందించి అనారోగ్యంతో సోమవారం మృతి చెందిన ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుండి అత్యున్నత స్థాయికి ఎదిగి అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడ్డారని వారి సేవలు మరువలేనివని అన్నారు. ములాయం మృతి యాదవ సంఘానికి కాకుండా అణగారిన వర్గాల వారికి తీరని నష్టం అన్నారు. కార్యక్రమంలో దశరథ నాయక్, జటంగి సతీష్, రాజు యాదవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Attachments area