Monday, 2 November 2026

పేదింటి ఆడపిల్లలకు వరంగా కళ్యాణలక్ష్మి

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ
హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లు వరంగా నిలిచాయని ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు. ఈ పథకాలతో పెళల్‌ఇ కాదన్న బాధ లేకుండా పోయిందని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు ధీమగా ఉన్నారని అన్నారు. సిఎం కెసిఆర్‌ దూరదృష్టితో పెట్టిన ఈ పథకం పేదింటి ఆడపిల్లలకు భరోసాగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌  నగరంలోని కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం బాచుపల్లి మండల కేంద్రంలో 13 మంది లబ్దిదారులకు షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే వివేకానంద్‌, ఎమ్మెల్సీ రాజులు అందజేశారు. ఆడపిల్లలను భారంగా భావించకుండా, పేదింటి ఆడబిడ్డల పెండ్లికి చేయూతనిస్తూ ప్రభుత్వం షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,00,116/- అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం సమర్థవంతమైన అములుతో బాల్య వివాహాలకు సైతం అడ్డుకట్ట పడింది.————-