పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్న కేసీఆర్..
సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం.
హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్..
హుస్నాబాద్ 3సెప్టెంబర్ జనంసాక్షి
అక్కన్నపేట మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు 26,03,016 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 26మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే శ్రీ వొడితెల సతీష్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు,
2014 ముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తునామాన్నారు .
ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుంది.
కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ఆడబిడ్డలకు ఒక భరోసాగా ఉంది.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదు.
భారతదేశంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణ లక్ష్మి,షాది ముభారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు,
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది.
టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమానికే పెద్ద పీట వేశారు అని అన్నారు,
సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే.
ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోంది పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన కళ్యాణలక్షీ పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పథకం ఉండడం ఎంతో గర్వంగా ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.
ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు.
మహిళల రక్షణ కోసం షీ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది.గర్భినీ స్ర్తీల కోసం, పుట్టిన పిల్లలకోసం కేసీఆర్ కిట్టు అందజేయడం జరుగుతుంది.పల్లెల అభివృద్ధే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుంది.పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తుంది.పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు హరితహారం కార్యక్రమం, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది.మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూటిక తీపించడం జరిగింది అన్నారు.