Monday, 2 November 2026

*పేద కుటుంబానికి అండ *

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 01మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన ఉప్పు గంగారాజం కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదంతో మరణించగా వారి భార్యకు సాయమ్మకు తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన 4 లక్షల 50 వేల రూపాయల విలువగల చెక్కును ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అందించాడు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బొడ్డు రాజేష్ ,గ్రామశాఖ అధ్యక్షులు అచ్చా చిన్న రాజాం ,కొప్పెరా నడిపి హనుమంతు,ఎంపీపీ, కటిపెల్లి సరోజాన అదిరెడ్డి, దంరాజ్ పల్లి సర్పంచ్ మైదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు