పేద కుటుంబానికి ఆర్థిక సాయం.
బెల్లంపల్లి, జులై 26, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద ముస్కె బుర్రక్క ఇటీవల కాన్సర్ తో మరణించింది. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్ బుధవారం బుర్రక్క ఇంటికి వెళ్లి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తనవంతు సాయంగా కొంత నగదు అందజేశారు. ఈకార్యక్రమంలో వార్డు సభ్యుడు చొక్కాల నగేష్, ముస్కె రాము, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.