కోమిరే సంజీవ్ గౌడ్ అందించిన సేవలు మరువలేనివి.
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జింధం చక్రపాణి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 26 (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ కోసం ఎనలేని సేవలు అందించిన కొమిరే సంజీవ్ గౌడ్ కృషి మరువలేనిదని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి అన్నారు. బుధవారం బండారి ఫంక్షన్ హాల్లో కోమిరే సంజీవ్ గౌడ్ దశదినకర్మ జరిగింది. టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు సంజీవ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణంలో విస్తరించడం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన అందించిన సేవలు మరువలేనివని తెలిపారు. సంజీవ్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలిపారు .కార్యక్రమంలో తెలంగాణ పవర్ లుం టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ,మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.