Wednesday, 4 November 2026

పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత

హైదరాబాద్‌,జూలై9(జ‌నం సాక్షి): పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతపేద బ్రాహ్మణులను గుర్తించి వారిని అన్నివిధాలా ఆదుకునేందుకు స్థానిక సంఘాలు ముందుకు రావాలని బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్తపేటలోని కమర్షియల్‌ టాక్స్‌ కాలనీ కమ్యూనిటీహాల్‌లో ఎమ్‌. బి. ఎస్‌. ఆద్వర్యంలో జరిగిన ఎగ్జిబిషన్‌ లో పేద బ్రాహ్మణ విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌ లు అందజేశారు.పేద బ్రాహ్మణ విద్యార్థులకు విద్యార్జన న నిమిత్తం తమ వంతు సహాయసహకారాలు అందించాలనే తలపుతో స్కాలర్‌షిప్‌ లు అందజేస్తున్నారు.ఇందుకు దాతలుగా సహాయం అందజేశారని నిర్వాహకుడు మన బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి అవధానుల నర్సింహ్మ ప్రసాద్‌ తెలియజేశారు. ప్రతి నెల తాము నిర్వహిస్తున్న మన బజార్‌ ఎగ్జిబీషన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న పేద విద్యార్ధులను గుర్తించి తాము నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ లో బ్రాహ్మణ పెద్దలు, ఇతర సంఘలా నాయకుల చేతులవిూదుగా వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు ,బ్రాహ్మణ పరిషధ్‌ సభ్యులు వేలేటి మృత్యుంజయ శర్మ,. మరుమాముల వెంకటరమణ శర్మ ,సుమలత సుధాకర్‌ శర్మ , సువర్ణ సులోచన,గంగు భానుమూర్తి. ,శ్రీనివాస్‌ మొగులూరి, గోగులపాటి కృష్ణ మోహన్‌ , గట్టు శ్రీనివాసాచార్యులు. అవధానుల నరసింహ ప్రసాద్‌ శర్మ . కోనేటి శ్రీనివాస్‌,.కమలాకర శర్మ, మురుకుట్ల రాజేశ్వర శర్మ, డాక్టర్‌ దీపక్‌ బాబు అవధానుల సవిత, గిరిజ రాజకుమార్‌ తదితరులు పాల్గొన్నారు ..