బ్యాంకు వివరాలు ఇస్తే అంతే సంగతులు
హైదరాబాద్,జూలై9(జనం సాక్షి): ఆదాయపు పన్ను రిటర్న్స్‌లు దాఖలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఫేక్ మెయిల్స్‌తో జగ్రత్తగా ఉండాలిన అధికారులు సూచించారు. ఐటి శాఖ నుంచినేరుగా వచ్చే మెయిసళ్లుకు పరిశీలించిన తరవాతనే సంప్రదించాలన్నారు. రీఫండ్ అంటూ మెయిల్‌కు వచ్చే సందేశాలకు స్పందిస్తే అంతే సంగతులని హెచ్చరించారు. అలా వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు నమోదు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిందేనని సైబర్ కైం పోలీసులు హెచ్చరిస్తున్నారు . ఆదాయపు పన్ను రిటర్న్‌ల పేరుతో ఫిషింగ్ సందేశాలు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుం టున్నారని సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ నుంచి లెటర్స్‌ను మార్చి.. స్పూఫింగ్ మెయిల్స్ సృష్టించి మోసాలు చేస్తున్నారని, అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఈసంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ-ఫైలింగ్‌కు ఈ నెల31 చివరి తేదీ. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది హ్యాకర్లు.. తప్పులు దొర్లాయని, మళ్లీ దాఖలు చేయాలని ఖాతాదారుల మెయిల్ ఐడీలకు ఫిషింగ్ సందేశాలు పంపిస్తున్నారు. ఐటీ రిటర్న్ రీఫండ్ చేస్తామని మాయమాటలు చెబుతున్నారు. ఆ సందేశంపై క్లిక్ చేసి బ్యాంక్ ఖాతా, డెబిట్, క్రెడిట్ వివరాలు, పాస్‌వర్డ్‌లు ఎంటర్ చేస్తే మన బ్యాంక్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇలాంటి సందేశాలకు స్పందించొద్దని, రీఫండ్ చేస్తామంటే వివరాలు ఇవ్వొద్దని అన్నారు. అలాంటి సందేశాలు ఉంటే ఐటి అధికారులతో నేరుగా సంప్రదించాలన్నారు.




