పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యా నిలయాలు గురుకులాలు.
ప్రభుత్వ పాఠశాలలను శుభపరచుకునే నైతిక బాధ్యత మనదే.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు సెప్టెంబర్ 11(జనంసాక్షి)తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ గురుకులం” కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలను శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు సందర్శించారు.ఈ సందర్భంగా వైస్
చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 5వ తేది నుండి 11 వరకు రోజువారీ ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నార ని విద్యార్థుల చదువు మరియు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు ఉన్నత లక్ష్యంతో గురుకులాలకు పునాదులు వేస్తున్న సంకల్పానికి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యా నిలయాలు తెలంగాణ గురుకులాలని .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల విద్యాలయాల పునర్జీవన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగిందని. దాని ప్రభావం కారణంగా ఎంతోమంది అట్టడుగు విద్యార్థులు ఉన్నత విద్యా శిఖరాలను చేరుకున్నరన్నారు. అలాంటి గురుకుల విద్యాలయాలను మరింత పటిష్టంగా తయారు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా “స్వచ్ఛ గురుకులం కార్యక్రమాన్ని నిర్మిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గురుకుల విద్యాలయాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం. రాజకీయ ప్రముఖులు,స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందని. దీని ద్వారా విద్యాలయాలకు, సంస్థలకు మధ్య ఒక వారధిని నిర్మించి గురుకుల విద్యా వ్యవస్థలను మరింత పటిష్టంగా ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులతో కలసి స్వచ్ఛ గురుకుల ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్నికి శ్రీకారం చుట్టారు.విద్యార్థులతో మాట్లాడుతూ వారి తరగతి గదులు మరియు అక్కడున్న వంటశాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, నాణ్యమైన విద్య అందుతుందని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు పాటించాలని,ఎప్పటికప్పుడు ఇలాంటి స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరిని బాగస్వామ్యులైన చెయ్యాలని ఆమె పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మంకల రాఘవేందర్,సంగీతా ఠాకూర్, నాయకులు ఈర్షద్, పాఠశాల టిచర్లు మరియు ఉపాద్యాయులులలిత,రాధిక,కృష్ణవే ణి, విజయలక్ష్మి, అనిత, సంధ్య, స్వప్న, సుశీల, గీతారాణి, శ్వేత,గీతాబాయి,మల్లేశం ,సంగప్ప ,జంగయ్య,బసంత్ రెడ్డి,రామలింగం ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు