పేద, మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తేలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి భారతదేశానికే ఆదర్శం
తెలంగాణలో ఉన్న పథకాలు ఇతర రాష్ట్రంలో లేవు
…రాష్ట్రంలోని పథకాలు దేశానికే ఆదర్శం
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్టు 18 :
పేద, మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తేలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి భారతదేశానికే ఆదర్శమని, తెలంగాణలో ఉన్న పథకాలు ఇతర రాష్ట్రంలో లేవని, రాష్ట్రంలోని పథకాలు దేశానికే ఆదర్శమని
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
శుక్రవారం సంగారెడ్డి మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ హాజరై చెక్కుల పంపిణీ చేశారు.
సంగారెడ్డి మండలం (10) సంగారెడ్డి పట్టణం (28) మొత్తం 38 మంది లబ్ధిదారులకు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా చెక్కల పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ
పేద మధ్య తరగతి కుటుంబాల కష్టాలు తేలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
తెలంగాణలో ఉన్న పథకాలు ఇతర రాష్ట్రంలో లేవని, రాష్ట్రంలోని పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ మోడల్ కావాలని కోరుకుంటున్నారని, వికలాంగులకు రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.
రాష్ట్రంలోని పథకాలు, అభివృద్ధి, సంక్షేమం దేశానికి అవసరం అది కేసిఆర్ తోనే సాధ్యమన్నారు.
జిల్లా మంత్రి హరీష్ రావు గారి పూర్తి సహకారంతో సంగారెడ్డి అభివృద్ధి అభివృద్ధిలో ముందు పయనిస్తుందన్నారు.
ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసిఆర్ కు అండగా మనం అందరం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగులా విజయా లక్ష్మి రవి ,CDC చైర్మెన్ కసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ CDC చైర్మెన్ విజేందర్ రెడ్డి ,జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మార్కేట్ కమిటీ చైర్మన్ ప్రభూ గౌడ్ ,మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి , కౌన్సిలర్లు ,లబ్ధిదారులు పాల్గొన్నారు..