మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధిలో శూన్యమని మున్సిపాలిటీ లో పట్టణ ప్రగతి పేరుతో ప్రజాధనం వృధా తప్ప అభివృద్ధి జరిగింది ఏమీలేదని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్నగౌడ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుండి వార్డుల అభివృద్ధి కొరకు సలహాలు సూచనలు తీసుకున్న స్థానిక కౌన్సిలర్లు ఛైర్మెన్ మరియు కమిషనర్ గతంలో నాలుగు విడుతల పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించి అందులో గుర్తించిన పలు సమస్యలను పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేటి వరకు కూడా నిధులు కేటాయించకుండ అట్టి పనులకు ఇంకా ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తు గతంలో 20 కోట్ల రూపాయలు మోత్కూర్ మున్సిపాల్టీకి మంజూరు అయ్యాయి అని కేవలం జెసిబి టాక్టర్ డోజర్ ల తో తూతూ మంత్రంగా పనులు చేస్తూ చెట్లను నాటి వాటికి రక్షణ కల్పించకుండా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయకుండా కేవలం పట్టణ ప్రగతి జరుగుతున్న రోజులలోనే అధికారులకు చెట్లు గుర్తుకొస్తాయి తప్ప పెట్టిన మొక్కలను పరిరక్షించుకునే బాధ్యత ఏ ఒక్క అధికారికి గుర్తుకు ఉండదు. ప్రజలకు ఉపయోగపడే మురికి కాల్వల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం వీధి లైట్లు ఏర్పాటు మంచినీటి సమస్య ఇలాంటి శాశ్వత పనులకు నిధులు కేటాయించకుండా ఇటీవల ఆరేగుడెం సాయి నగర్ కాలనీల్లో నీటి కొరత ఉందని చెప్పిన కూడా పట్టించుకోని కొందరు ప్రజా ప్రతినిధులు మోత్కూర్ మున్సిపాలిటీ ఏర్పడి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ సబ్ ప్లాన్ కింద కొన్ని సీసీ రోడ్లు వేశారు, కానీ మిగతా అన్ని ఏరియాల్లో సీసీ రోడ్లు లేకపోవడం ప్రధాన విధుల్లో స్ర్తీట్ లైట్స్ లేకపోవడం సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇటీవల కురిసిన వర్షాలకు ప్రతి వార్డులో నీటి నిల్వలు పెరిగి దోమల వల్ల జ్వరాలు వచ్చిన బాధితులు ఎందరో వున్నారు…ఉదయం చెత్త బండిలో సమాచారం ..మీ యొక్క ఇంటి పన్ను నల్ల పన్ను తక్షణమే చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధి సహకరించండి అని క్యాసెట్ వేసి వినిపిస్తారని ఆయన ఆరోపించారు. అన్నెపువాడ లో 4 స్తంభాలు విధి మధ్యలో ఉన్నాయి ఇండ్లకు సమీపాన ఉన్నాయి అని మున్సిపల్ కార్యాలయంలో చాలా సందర్భాల్లో చెప్పిన అధికారులు పట్టించుకోవట్లేదని తెలిపారు.
పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధిలో శూన్యం




