పేరుకే 50 పడకల ఆసుపత్రి…….
నిరుపేదలకు అందని వైద్యం……
***చిట్యాల సూపరిండెంట్,డీఎంహెచ్వోని సస్పెండ్ చేయాలి…..
***వెలిశాల ప్రభుత్వ హాస్పిటల్ కి పర్మినెంట్ డాక్టర్ ను కేటాయించాలి……
***సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్…..
టేకుమట్ల.సెప్టెంబర్15(జనం సాక్షి)జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకు 50 పడకల ఆసుపత్రి అందులో కనీస సౌకర్యాలు కరువైనవి సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేశ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులలో నిరుపేదలకు అందాల్సిన వైద్యం సరైన సమయంలో అందకపోవడంతో.ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉంది 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆసుపత్రిలో ఆరుగురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.విధుల్లో ఉండవలసిన డాక్టర్లు సరైన టైంలో ఉండకుండా వంతుల వారిగా డ్యూటీలు చేస్తున్నారు.పిల్లల సంబంధించిన డాక్టరు ప్రతిరోజు చూడాల్సి ఉన్నది.కానీ ఒక్కరోజు కూడా పిల్లల డాక్టర్ చూసిన పరిస్థితి దాఖలు కనబడడం లేదు.ప్రతిరోజు మహిళ డాక్టర్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీల పరిస్థితి దారుణంగా ఉన్నది.డెలివరీ అయిన పేషెంట్లను ప్రతిరోజు చూడాల్సిన బాధ్యత మహిళ డాక్టర్ పైన ఉన్నది.ఆపరేషన్ అయిన పేషెంట్లు మాత్రం విద్యుత్ కొరతతో విలువలాడుతున్నారు. హాస్పటల్లో24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది.కనీసం కూడా జనరేటర్ పనిచేయడం లేదు.ఎక్సరే తీయవలసిన మిషన్ కూడా పని చేయకపోవడం చాలా దారుణమని అన్నారు.షుగర్ టెస్ట్లు చేయవలసిన డాక్టర్లు టైం కు రారు.వచ్చిన పేషెంట్లను బెదిరింపులో గురి చేస్తున్నారు.బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయవలసిన సిబ్బంది సమయానికి రాకుండా వచ్చిన పేషెంట్లను బెదిరిస్తున్నారు. ఇదేమిటి అని అడుగుతే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో అని కూడా అంటున్నారు.బాత్రూంలో టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్న పరిస్థితి లేదు ఏదో తాత్కాలికంగా శుభ్రం చేస్తున్నామంటే చేస్తున్నామని అన్నట్టు ఉన్నది ఇబ్బందిగా ఉన్నటువంటి పేషెంట్లు టాయిలెట్స్ పోతే ఇంకో కొత్త రోగం అంటుకునే పరిస్థితి దాపురిస్తుందని అన్నారు.హాస్పటల్ సూపరిండెంట్ ప్రతిరోజు ఆసుపత్రి పరిస్థితిని పరిశీలించాలి కానీ ఆయన చేయడం లేదు ఆయనకు కొందరు భజన భక్తులు చెప్పిందే వింటూ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు.ఈ వర్షకాల పరిస్థితుల్లో ప్రజలకు తీవ్రమైన విష జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్ కి వెళితే తగ్గే పరిస్థితి మాత్రం కనబడడం లేదు సరియైన వైద్యం అందగా పేద ప్రజలు విలవిల ఆడుతున్నారు జిల్లా సూపర్డెంట్ కూడా నామ్ కె వాస్తు తనిఖీలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.
Attachments area
|