పైలేరియా వ్యాధి నివారణ కు ఉచితంగా మందుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కెసిఆర్ రాష్ట్రంలో పైలేరియా వ్యాధి నివారణ కొరకు ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు
గురువారం చిట్యాల గ్రామంలో స్వయంగా గ్రామ ప్రజలకు పంపిణి చేసారు తర్వాత వారు మాట్లాడుతూ ఎలాంటి అపోహలు లేకుంట ప్రజలందరూ ఈ మందులను ఆరోగ్యశాఖ వారి సూచనల మేరకు వేసుకోవలసిందిగా తెలియజేసారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జూనియర్ పంచాయతీ కార్యదర్శి బి ఆర్ఎస్ నాయకులు , కొమురెల్లి, పోతుగంటి శ్రీశైలం, దాసరి రాములు, కోలా ఎల్లయ్య, గజ్జి అశోక్, దాసరి సోమేశ్వర్, గుంటుక వెంకన్న, దేశెట్టి సంజీవ, కొంతం సోమక్క, ఏఎన్ఎం గీత, ఆశా వర్కర్లు పులుగుజ్జ శోభ, ఈదురు సునీత, అంగన్వాడీ టీచర్లు . రాజేశ్వరి,. చంద్రకళ, శోభ తదితరులు పాల్గొన్నారు.
Attachments area