Wednesday, 4 November 2026

పొడుభూములకు పట్టాలివ్వాలి.

తుడుందెబ్బ ఆధ్వర్యంలో 25న చలో మహాదేవపూర్.
తుడుందెబ్బజిల్లా
అధ్యక్షులు కుమార్ఆదివాసీ..

మహాదేవపూర్ (కాళేశ్వరం ) ఆగస్టు 22 జనంసాక్షి న్యూస్ :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సబ్ డివిజన్ పారెస్ట్ డి ఎఫ్ ఓ కార్యాలయం పరిధిలో ఉన్న మండలాలలోని ఆదివాసీ ప్రజలు గత కొన్నేళ్లుగా  చేసుకుంటున్న పొడుభూములకు  మట్టాలివ్వాలని ఈ నెల 25న ఛలో మహాదేవపూర్ సబ్ డివిజన్ ఫారెస్ట్ డి.ఎఫ్.ఓ. కార్యాలయంముందు ధర్నా కార్యక్రమాన్నీకి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు మడే కుమార్ ఆదివాసీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ  ప్రజా సంఘాల మద్దతు కలుపుకొని మహాదేవపూర్ లో  నిర్వహించడం  జరుగుతుంది కనుక ఆదివాసీలు పొడుదారులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపుణిస్తున్నాము. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడే సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షులు కొవ్వూరి కిష్టయ్య పెద్ది మధునయ్య ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు మట్టి కిషోర్ తొర్రెమ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.