పోకిరి 4కె వర్షన్‌ విడుదలకు రంగం సిద్దం

ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోద్దో ఆడే పండుగాడు.. అంటూ థియేటర్లలో ప్రిన్స్‌ మహేశ్‌ బాబు చేసిన రచ్చను ఎవరైనా మర్చిపోతారా. ఆల్‌ టైం బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచిపోయిన పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మరోసారి అలరించబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ మూవీ స్పెషల్‌ షో టికెట్స్‌ కోసం మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాలిఫోర్నియాలో ఏర్పాటుచేయబోతున్న స్పెషల్‌ షోకు భారీ స్పందన వస్తోంది. దాని కోసం కేటాయించిన టికెట్లు కేవలం ఒక్క గంటలోనే అమ్ముడయ్యి రికార్డు సృష్టించడం వైరల్‌ గా మారింది. దీనిపై ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్కున్నారు. పోకిరి సినిమా విడుదలై ఇన్ని సంవత్సరాలైనప్పటికీ… ఆ మూవీలోని డైలాగ్స్‌, సాంగ్స్‌ కున్న క్రేజ్‌ ఇప్పటికీ తగ్గలేదు. కాగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు సృష్టించిన ఈ సినిమా 4కె వెర్షన్‌ లో మరోసారి థియేటర్లో విడుదలకు సిద్ధమైంది. ఆగష్టు 9వ తేదీన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజే పోకిరి సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.