, గాంధారి జనంసాక్షి జులై 28
ఎల్లారెడ్డి నియోజకవర్గ లింగంపేట్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లింగంపేట వాగు ప్రవాహం ఉధృతంగా మారడం వల్ల రాంపల్లి తండాకి చెందిన ముగ్గురు వ్యక్తులు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. గ్రామస్తుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ప్రభుత్వ విప్ & కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి హైద్రాబాద్ లోని మంత్రి నివాసంలో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ సిబ్బంది, మండల అధికారులతో మాట్లాడి వరదలో చిక్కుకున్న వారికీ సహాయక చర్యలు అందిస్తూ ధైర్యం చెప్పాలని సూచించారు.
ఎల్లారెడ్డి సి.ఐ శ్రీనివాస్ మరియు ఎస్సై లతో వీడియో కాల్ మాట్లాడి అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
వరద ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే వరకు అక్కడే వుండి వారికీ ధైర్యం చెప్పాలని సూచించారు.
అత్యవసర సహాయం అందించేందుకై ఎమ్మెల్యే & మంత్రి NDRF బృందం చీఫ్ రాహుల్ బొజ్జ తో మాట్లాడగా వెంటనే వారి బృందం బయల్దేరి మార్గమధ్యంలో ఉండగా వరద ప్రవాహం తగ్గడంతో వారు సురక్షితంగా బయటకు వచ్చారని తెలిసి తిరుగు ప్రయాణమయ్యారు.
అత్యవసర సమయంలో ఎమ్మెల్యే ని సంప్రదించిన వెంటనే స్పందించి జిల్లా మరియు స్థానిక అధికారులను సంఘటన స్థలానికి పంపి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే కి రాంపల్లి తండా గ్రామస్తులు కృతఙ్ఞతలు తెలియచేసారు.





