నాలుగు వరసల రోడ్డుకు ప్రతిపాదనలు
భూదాన్‌పోచంపల్లి,ఆగస్ట్4(జనం సాక్షి): గ్రావిూణ పర్యాటక కేంద్రంగానే కాకుండా పురపాలకంగా అవతరించిన భూదాన్ పోచంపల్లికి మహర్దశ రానుంది. చేనేత వస్త్రాల తయారీతో ప్రపంచాన్ని ఆకర్శిస్తూ భూదానోద్యమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పోచంపల్లి ఇక అన్ని రంగాల్లోఅ భివృద్ది చెందేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలలో భాగంగా పోచంపల్లికి నాలుగు వరుసల రోడ్డును మంజూరు చేశారు. ఘట్‌కేసర్ నెహ్రూ రింగ్ రోడ్డు నుంచి భద్రాచలం వరకు సుమారు 230 కిలోవిూటర్ల మేర 180 ఫీట్ల వెడల్పుతో వేయనున్న నాలుగు లైన్ల రోడ్డు పోచంపల్లి మండల కేంద్రం విూదుగా వెల్లనుంది. ఇక పోచంపల్లి అభివృద్ది చెందటానికి అన్ని రకాల అవకాశం ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరుగగా ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మరింతగా పుంజుకునే అవకాశం లేకపోలేదు. పురపాలకం కావటంతోపాటు రోడ్డు పనులు ప్రారంభమైతే మెరుపువేగంతో భూదాన్‌పోచంపల్లి అభివృద్ధి చెందనుందనే చెప్పాలి.అంతేకాకుండా మండల పరిధిలోని పెద్దగూడెం, జగత్‌పల్లి, నారాయణగిరి, జలాల్‌పూర్, భీవనపల్లి, కనుముక్కుల, దంతూరు, వంకమామిడి గ్రామాలకు సవిూపంగా ఈ రోడ్డు వెల్లనుంది. ఈ రోడ్డు కోసం ఇప్పటికే అక్కడక్కడా సెంటర్ లైన్ మార్కింగ్ వేయడంతోపాటు గురువారం ఆర్‌అండ్ బీ ఆధ్వర్యంలో షెలాడియా అనే సర్వే సంస్థతో సర్వే పనులు చేపట్టారు. ఈ రోడ్డు ఘట్‌కేసర్, గౌరెల్లితో పాటు భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, తిర్మల్‌గిరి, తొర్రూరు, మహబూబాద్, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం వరకు ఈ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డు ప్రతిపాదనలతో పాటు సర్వే పనులు వేగవంతం కావడంతో ఈ రోడ్డును మరింత త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు నాలుగు లైన్ల రోడ్డు వస్తుండటంతో అభివృద్ధిలో మరింత దూసుకుపోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఇక బాటసింగారం సవిూపంలోని పిగ్లిపూర్ గ్రామంలో భారీ లాజిస్టిక్ హబ్‌ను ఏర్పాటు చేస్తుండగా ఈ రోడ్డుకు మరింత ప్రాధాన్యత పెరుగనుంది.




