గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన
గంగారం ఫిబ్రవరి 22 (జనం సాక్షి)
గంగారం మండల లోని పోడు భూములకు పట్టాలు ఇస్తామని పోడు రైతుల నుండి మూడు నెలల క్రితం దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం నేటికి పట్టాలు ఇవ్వలేదని ఎప్పటి వరకు పట్టాలు ఇస్తారో నిర్దిష్టంగా గడువు ప్రకటించాలని గంగారం మండలం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు.
గంగారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సువర్ణపాక సరోజన జగ్గారావు మాట్లాడుతూ పోడు రైతులకు పట్టాలు ఇస్తానని ప్రభుత్వం చెప్పి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఫారెస్ట్ వారు పోడు భూముల్లో సాగు విషయం లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల హక్కు పత్రాలు (పట్టాల )విషయంలో జాప్యాన్ని విడనాడి రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు భూములకు (పట్టాలు) హక్కు పత్రలు ఎప్పుడు ఇస్తారు




