పోడు రైతులు సర్వేకు అందుబాటులో ఉండాలి
టేకులపల్లి, అక్టోబర్ 20 (జనం సాక్షి): టేకులపల్లి, గొల్య తండ గ్రామ పంచాయతీ పరిధిలోని గురువారం పొడు భూముల సర్వే కు ముందు రైతులకు సర్వే తేదీ, టైం కి అందుబాటులో ఉండాలని కోరుతూ అప్లికేషన్ పెట్టిన రైతులు అందరికీ ముందస్తు నోటీసులు అందించారు. ఆ నోటీసులలో ఇచ్చిన టైం ప్రకారం పోడు రైతులు సర్వే చేయించుకోవడానికి అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ హక్కుల కమిటీ ఛైర్మన్ ధారవత్ సురేష్, 1వ వార్డు సభ్యులు నోముల భానుచందర్, 7వ వార్డు సభ్యులు తాటి రవి కుమార్, పంచాయతీ కార్యదర్శి యల్. కిరణ్, అటవీ అధికారులు, సిబ్బంది బిచ్చు, రైతులు రాములు, వెంకటయ్య, శ్రీశైలం, వెంకన్న, శ్రీనివాస్ జగన్నాథం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.