పోలవరం పూర్తిచేయించే బాధ్యత కేంద్రానిదే
విూడియాతో ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్
న్యూఢల్లీి,డిసెంబర్9(జనం సాక్షి ): పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,అందుకే దీని నిర్మాణం త్వరగా పూర్తి చేయించడంలో కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. పోలవరం త్వరగాపూర్తి కావాలన్నది తెలుగువారి ఆకాంక్ష అన్నారు. ఆయన గురువారం పార్లమెంట్‌లోని విూడియాలో పాయింట్‌లో విూడియాతో మాట్లాడుతూ.. సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లను కేంద్రం ఆమోదించాలని కోరారు. కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మండిపడ్డారు. పోలవరం హెడ్ క్వార్టర్స్‌ను రాజమండ్రికి మార్చాలని డిమాండ్ చేశారు. పోలవరం బకాయయిలను కేంద్రం తక్షమే విడుదల చేయాలని పేర్కొన్నారు. బకాయిలు ఇవ్వకుండా,పెరిగిన ధరలకు అనుగుణంగా నిధులు విడుదల చేయకుండాకేంద్రం కావాలనే తాత్సారం చేస్తోందన్నారు. దీనికితోడు సకాలంలో పూర్తికాదన్న రీతిలో ప్రకటనచేయడం సరికాదన్నారు.