Tuesday, 3 November 2026

పోలీసుల అదుపులో చెన్నాపురం ఆదివాసీలు

చర్ల: మండలపరిధిలోని పెద్దమిడిసిలేరు పంచాయతీ చెన్నాపురం గ్రామానికి చెందిన ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. మావోయిస్టుల వారోత్సవాల సందర్గా తిప్పాపురం నుంచి పామేడ్‌ రహదారిపై పెద్దసంఖ్యలో కందకాలు తవ్విన నేపధ్యంలో కూంబింగులకు వెల్లిన పోలీసులు శనివారం రాత్రి ఏడుగురు ఆదివాసీలను అదుపులోకి తీసుకున్నారు. చెన్నాపురం గ్రామంనుంచి రెండు మాసాలుగా సంతకాలకు రాటంలేదనే సాకుతో పోడు సాగు చేసుకుంటున్న తమవారిని నిర్బంధించి తీసుకువచ్చారని గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థులంతా వస్తే వీరిని వదులుతామని చెప్పగా ఆదివారం వచ్చామని.., పోలీసులు తమ అదుపులో వున్న ఏడుగురిలో ఐదుగురిని వదిలి మరో ఐదుగుర్ని అదుపులో తీసుకున్నారని వారు తెలిపారు.. పోలీసుల అదుపులోవున్న మడకం ఐత, మడకం నంద, సొడి ఇడమ, సొడి అడమ, మడకం బద్రి, మడకం సొముడు, మడకం నందను వెంటనే విడుదలచేయాలని వారు కోరారు. ఈ విషయంపై వెంకటాపురం సీఐ అల్లంనరేందర్‌ని వివరణ కోరగా తాను శలవులో వున్నానని వివరాలు తెల్సుకుంటానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *