:
• 2015 నవంబర్ 22న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంకుస్థాపన, భూమిపూజ చేశారు.
• ఈ సెంటర్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసింది.
• 2022 ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.
• ఈ సెంటర్లో మొత్తం 6 లక్షల 42 వేల చదరపు అడుగుల నిర్మాణం జరిపారు.
• 2.16 లక్షల చదరపు అడుగులు, సూపర్ స్ట్రక్చర్ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉన్నది.
• ఈ సెంటర్ ను మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించారు.
• టవర్ ‘ఏ’లో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు 19 అంతస్తులు,
• టవర్ ‘బీ’లో రెండు బేస్‌మెంట్లు గ్రౌండ్‌ఫ్లోర్, 15 అంతస్తులు,
• టవర్ ‘సీ’లో ఆడిటోరియం గ్రౌండ్‌ఫ్లోర్, రెండు అంతస్తులు,
• టవర్ ‘డీ’లో గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తు,
• టవర్ ‘ఈ’లో సీసీసీని 4 నుంచి 7 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు.
• మరో రెండు బేస్‌మెంట్ లెవల్‌లు ఉన్నాయి.
• అన్ని టవర్లలో ‘ఏ’ టవర్ ఎత్తయినది. దీనిలో మొత్తం 20 అంతస్తులు ఉన్నాయి. దీనిలోనే నాల్గో అంతస్తులో డీజీపీ చాంబర్, 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చాంబర్ ఉంటాయి. 7వ అంతస్తులో ప్రముఖుల చాంబర్లు ఉన్నాయి.
• టవర్ ఏ, బీలను 14వ అంతస్తులో కలుపుతూ 400 మెట్రిక్ టన్నుల బరువుతో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్ వంతెన నిర్మించారు. దీనికి సోలార్ ఫొటోవోల్టిక్ ప్యానల్స్‌తో రూఫ్‌టాప్ ఏర్పాటు చేశారు.
• నైరుతివైపు ఉన్న టవర్‌పైన హెలిపాడ్‌ను ఏర్పాటు చేశారు. వీవీఐపీ మూమెంట్స్ కోసం హెలికాప్టర్ సేవలను వాడుకోవచ్చు.
• టవర్లలోని కింది ఫ్లోర్లలో ఆడిటోరియం, కేఫ్, మల్టీపర్పస్ హాల్, మీడియా సెంటర్, రిసెప్షన్ లాబీ ఏర్పాటుచేశారు.
• టవర్ – ఏలో 550 వర్క్ స్టేషన్లు ఉంటాయి. వెయ్యి మంది సిబ్బంది పనిచేయవచ్చు.
• టవర్ బీలో 580 వర్క్ స్టేషన్లు ఉన్నాయి. 1500 మంది సిబ్బంది పనిచేయవచ్చు. అన్ని ఫ్లోర్లలోనూ కిచెన్ అందుబాటులో ఉంది.
• ఆడిటోరియంను 590 మంది సీటింగ్ కెపాసిటీతో ఏర్పాటు చేశారు.
• మొత్తంగా 600 కు పైగా వాహనాల పార్కింగ్ సౌకర్యం కలదు.
• టవర్ – డీ గ్రౌండ్ ఫ్లోర్‌లో 125 మంది కూర్చునే సామర్థ్యంతో మీడియా బ్రీఫింగ్ హాల్ ఉంది. నేరుగా అక్కడి నుంచే లైవ్ కవరేజ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.
• కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక డాటా సెంటర్ కోసం బెల్జియం, జర్మనీ నుంచి సర్వర్లు తెప్పించారు. దాదాపు 30 పెటా బైట్ల సామర్థ్యం ఉన్న స్టోరేజీ ఉన్నది. అంటే 10 లక్షల సీసీటీవీ కెమెరాల ఫీడ్ ఇందులో నిక్షిప్తం అవుతుంది.
• ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాల ఫీడ్ చూసే సామర్థ్యంతో భారీ స్క్రీన్ కూడా ఉంది.
• అలాగే, తెలంగాణలోని అన్ని జిల్లాల సీసీటీవీల ఫీడ్, ఇతర సమాచారం కూడా హైదరాబాద్‌లోని సీసీసీకి అనుసంధానమవుతుంది.
• కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు, ప్రయోజనాలు :
• బహుముఖ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
• ప్రభుత్వరంగంలోని అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకొంటూ విపత్తుల సమయంలో ప్రజలను సకాలంలో కాపాడటం, నష్టాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
• నిరంతర పర్యవేక్షణతో రాష్ట్రంలో నేరాలను నియంత్రించడం కోసం పనిచేస్తుంది.
• ఈ సెంటర్‌లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, ప్రకృతివిపత్తుల నిర్వహణశాఖ సహా ముఖ్యమైన అన్ని ప్రభుత్వ విభాగాల కేంద్రాలు
• ఏదైనా విపత్తు, ప్రమాదం జరిగినప్పుడు అన్ని శాఖల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తారు.
• శాంతి భద్రతల పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కూడా ఎన్‌ఫోర్స్ మెంట్‌కు ఈ డాటాను వినియోగించుకోవచ్చు.
• రోజువారీ శాంతిభద్రతల నిర్వహణతోపాటు భారీ బహిరంగ సభలు, ఉత్సవాల సందర్భంగా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కూడా సాధ్యమవుతుంది.
• తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు, అన్ని అంబులెన్సులు, ఫైర్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, అన్ని ప్రధాన లొకేషన్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లు, మార్కెట్లు… ఇలా ప్రతి సమాచారాన్ని సీసీసీలోని హైఎండ్ డాటా ఎనాలసిస్ సెంటర్‌కు అనుసంధానిస్తారు.
- • రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే, సీసీటీవీల్లోని ప్రత్యేక స్టాఫ్ట్ వేర్ ద్వారా కెమెరాయే నేరుగా సీసీసీకి అలర్ట్ పంపుతుంది. అక్కడ పాప్‌అప్ స్క్రీన్‌పై వస్తుంది. దీంతో వెంట„నే సిబ్బంది అలర్ట్ అవుతారు.




