Wednesday, 4 November 2026

బోనాల మృతి పట్ల బండి సంతాపం

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి ) :

టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బోనాల రాజేశం అకాల మరణం పట్ల కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి సంతాపాన్ని ప్రకటించారు. బోనాల రాజేశం ఉన్నత వ్యక్తిత్వం కలిగి రాజకీయంగా ఆయనకు లభించిన అవకాశాలతో ప్రజలకు తనదైన శైలిలో సేవలు అందించారని పేర్కొన్నారు తగిన గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బోనాల రాజేశం ఆత్మకు శాంతి చేకూర్చాలని , ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ఎంపీ బండి సంజయ్ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.