మిర్యాలగూడ. జనం సాక్షి పోలీసు రాత పరీక్షలో ఎస్సి , ఎస్టి అభ్యర్థులతో పాటు బిసి అభ్యర్ధులకు కూడా కటాఫ్ మార్కులు తగ్గించాలని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఇటీవల ఎస్.ఐ , కానిస్టేబుల్ నియమాకాల కో సం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడు దల చేసిందన్నారు . నోటిఫికేషన్లో ముందుగా ప్రిలిమ్స్ రాత పరీక్షల కు ప్రభుత్వ నిభందనలు , గత రిక్రూట్ మెంట్ మాదిరిగా కాకుండా ఎస్సి , ఎస్టి , బిసి ఇడబ్ల్యుఎస్ అందరికీ అర్హత మార్కులను 60 కి నిర్ణయించిం దని తెలిపారు . దీనితో రాష్ట్రంలోని ఎస్సి , ఎస్టి , బిసి నిరుద్యోగులు ఆం దోళన చేయడం , అసెంబ్లీలోఒక ప్రకటన చేస్తూ గతంలో మాదిరిగా ఎస్ సి , ఎస్టి అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించారన్నారు . ఈ ప్రకటన చేయడం పట్ల ఆయన స్వాగతిస్తున్నామని అన్నారు . అయితే ఎస్సి , ఎస్టి కటాఫ్ మార్కులు తగ్గిస్తామని చెప్పారు కానీ , బిసిలకు వర్తింప చేస్తామని చెప్పక పోవడంతో ఆందోళనలో బిసి నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నాని ఆవేదన వ్యక్తం చేశారు . గతంలో ఎస్సి , ఎస్టిలకు తగ్గించిన మాదిరిగా బిసిలకు కూడ తగ్గించేవారన్నారు . బిసి అభ్యర్థులకు కుడా తగ్గిస్తామని ప్రకటించి , ఉంటే బాగుండేదన్నారు . కావున ఇప్పుటికైన సిఎం ప్రత్యేక చొరవతీసు కొని , ఎస్సీ , ఎస్టిల మాదిరిగా బిసి అభ్యర్థులు కూడా కటాఫ్ మార్కులను 60 నుండి 40 కు తగ్గించాలని అన్నారు.పోలీస్ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజేర్వేషన్స్ ఖచ్చితంగా పాటించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు కోలా సైదులు ముదిరాజ్, పసుల కాశీ యాదవ్,గంగపుత్ర సైదులు తదితరులు పాల్గొన్నారు
పోలీస్ నియమాకాల్లో బిసి అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించాలి




