– ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
తెలంగాణ వచ్చాక రైతులకు పెద్ద పీట వేసిన ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు అన్నారు. శుక్రవారం వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలోని రైతుబంధు ద్వారా భూమి ఉన్న రైతులకు 527 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయటం జరిగిందని అన్నారు. రైతు బీమా పథకం ద్వారా 659 మంది రైతులు మరణిస్తే తమ కుటుంబాలకు 32,వేల 90 లక్షల రూపాయలు రైతుల కుటుంబాలకు సహాయం అందించామని ఈ ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కిందని ఆయన పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితిలో ఉన్న ఉన్నటువంటి వారికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పెళ్లిళ్లు చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి తల్లి ఖాతాలో లక్ష రూపాయలు అందించామన్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి రోడ్లు నిర్మాణాలు చేసేందుకు తెరాస ప్రభుత్వం చొరవ తీసుకోబోతుందని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల తరబడి పోడు భూముల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు జీవో పాస్ చేసి పోడు భూముల లబ్ధిదారులకు విజయాలు చేకూర్చాలని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చల్ల ప్రసాద్, సిఐలు బాలకృష్ణ, నాగరాజు, ములకలపల్లి జడ్పిటిసి సున్నం నాగమణి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దొడ్డకుల రాజేశ్వరరావు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జుజ్జూరు వెంకన్న బాబు, గుర్రం వెంకటేశ్వరరావు, జడ్పిటిసి చిన్నంశెట్టి వరలక్ష్మి,ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి అధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాక రైతులకు పెద్దపీట




