పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి

 

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 14 (జనం సాక్షి) :-
తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని చల్వాయి గ్రామ సర్పంచ్ ఈ సం సమ్మయ్య, అన్నారు.బుధవారం గోవిందరావుపేట మండలం పరిధిలోని చల్వాయి గ్రామంలో అంగన్వాడీ మూడవ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసం అవగాహన సదస్సులో వారు పొల్గొని మాట్లాడారు.పోషణ మాసోత్సవాలలో భాగంగా నెల రోజులపాటు గ్రామస్థాయిలో పోషకాహార విలువలపై గర్భిణీలు బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించనున్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు,ఆరేళ్లలోపు చిన్నారులకు రక్తహీనత సమస్య నుండి కాపాడేందుకు వైద్య శాఖ సమన్వయంతో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రతీ నెల మొదటి వారంలో అంగన్వాడి కేంద్రాల్లో నమోదైన చిన్నారుల ఎత్తు,బరువుల కొలతలు తీసి పోషణ లోపమున్న పిల్లలను గుర్తించి,సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరు విటమిన్లు, మినరల్స్, అన్ని రకాల పోషకాలు గల ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి  అంగన్వాడి టీచర్ అరుంధతి,ఆయా ఆశ వర్కర్ తల్లులు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area