అనాథ పిల్లలకు 42వేల ఆర్థిక సహాయం
స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 14, ( జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో రోడ్డ బాబు అనారోగ్యంతో మృతిచెందగా,ఆతని బార్య సత్య లక్ష్మి అనారోగ్యంతో రెండునెలలక్రితంచనిపోవడం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు పాప (15) బాబు (6)ఉన్నారు.అమ్మ నాన్న చనిపోయిన ఈ పిల్లలు చాలా చిన్నవాళ్లు వీరికి ఏదైనా సాయం చేయాల ని మానవతా దృక్పథంతో ఉబ్బని రాజు, ఎద్దు కిరణ్,ఉబ్బని అజయ్ ముగ్గురూ కలిసి గ్రామంలో తిరిగి గ్రామ ప్రజల నుండి 42,220 రూపాయల విరాళాలు సేకరించడం జరిగింది. గ్రామస్థులు ఇ చ్చిన విరాళాలను చిన్నారులకు ఇవ్వడం జరిగిం ది.ఈకార్యక్రమంలో కుల పెద్దమనిషి బలిజ రాజు, గునిగంటి మల్లయ్య, మగ్గం కృష్ణంరాజు, భిక్షపతి, మన్యాల మహేందర్, సత్యం తదితరులు పాల్గొ న్నారు ఈ చిన్నారులకు విరాళాలిచ్చిన ప్రతి ఒక్క రికీ ఉబ్బని రాజు, ఎద్దు కిరణ్, ఉబ్బని అజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.