పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
— టేకులపల్లి సిడిపిఓ కే ఎం తార
టేకులపల్లి, సెప్టెంబర్ 8( జనం సాక్షి) : సరైన పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని టేకులపల్లి సిడిపిఓ కేఎం తార అన్నారు. సెప్టెంబర్ మాసంలో నెలరోజులపాటు పోషణ్ అభియాన్ మాసోత్సవాల కిషోర్ బాల ,బాలికలతో గురువారం మండలంలోని బేతంపూడి గ్రామపంచాయతీ పరిధిలో వెంకటయ్య తండా అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ కే యం తార, బేతంపూడి సర్పంచ్ యదలపల్లి బాబు మాట్లాడుతూ సరైన పోషకాలు అందిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని అన్నారు. ఆహారంలో పోషక విలువలు లోపిస్తే పిల్లలు శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండదని రక్తహీనత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆకుకూరల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయని అన్నారు ఎప్పటికప్పుడు పిల్లల బరువును కొలతలను జాగ్రత్తగా చూస్తూ ఉండాలని సూచించారు. ఈ అంగనవాడి కేంద్రానికి ఎన్నారై ఫౌండేషన్ ద్వారా టీవీని వితరణ చేశారు. సిడిపిఓ వితరణ చేసిన ఎన్నారై ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అనురాధ అంగన్వాడి టీచర్ సుగుణ పంచాయతీ కార్యదర్శి పాఠశాల హెచ్ఎం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.