– తెరాస శకం ముగిసినట్లే
– మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ
హైదరాబాద్, సెప్టెంబర్3(జనం సాక్షి) : తెరాస నిర్వహించిన ప్రగతి నివేదన సభ పెద్ద ఫ్లాప్ షో అని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ విూడియా హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సభ నిర్వహణలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. 25 లక్షల మంది సభకు హాజరవుతారని తెరాస నేతలు ప్రగల్భాలు పలికారని.. తీరా చూస్తే రెండున్నర లక్షల మందే సభకు వచ్చారని అన్నారు. సభ ద్వారా కేసీఆర్ తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇచ్చారని, అసలు సభ ఉద్దేశమైనా నెరవేరిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో తెరాస శకం ముగిసిందని అన్నారు. టీఆర్‌ఎస్ ఇక అధికారంలోకి రావటం కల్లా అని దుయ్యబట్టారు. కేసీఆర్‌కు ఉన్న జన, ధన బల నిరూపణకే ప్రగతి నివేదన సభ నిర్వహించారని, అయినా ప్రజల నుంచి సరైన స్పందన రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని డీకే అరుణ విమర్శించారు




