*ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి*
*అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి *వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి* అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2 ) జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రలోని ప్రజలందరూ జోగులాంబ అమ్మ వారి ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అదివారం దసరాదేవి శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భంగా శ్రీ.శ్రీ.శ్రీ.జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి ,స్థానిక శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం మరియు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, ఆలయాలను దర్శించు కున్నారు. దర్శించుకోవడానికి వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే, జడ్పిచైర్మన్ లు పూలబోకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురేందర్ కుమార్, మరియు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు శ్రీ.శ్రీ.శ్రీ. బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ,
అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధిలో ముందు ఉండాలని కోరుకున్నట్టు తెలియజేశారు. తెలిపారు.మంత్రి వెంట రాజోలి జెడ్పిటిసి రాజు, మున్సిపాలిటీ చైర్మన్ మనోరమ, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, అధికారులు,టిఆర్ఎస్ కార్యకర్తలు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ReplyForward
|